Friday, April 19, 2024

నడవలేనిస్థితిలో కమెడియన్ పంచ్ ప్రసాద్.. సాయం చేయాలని కోరుతున్న భార్య

బుల్లితెరపై తనదైన శైలిలో పంచులు విసురుతూ పాపులారిటీని సంపాదించుకున్నాడు ‘జబర్దస్త్’ కమెడియన్ పంచ్ ప్రసాద్ . ‘జబర్దస్త్’ వేదికగా టీవీ ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యాడు. అలా నవ్వించడం స్టార్ చేశాడో లేదో.. కొద్దిరోజులకే షోలో కనిపించడం తగ్గిపోయింది. ఇంతకీ ఎక్కడికెళ్లాడు.. ప్రసాద్ రెండు కిడ్నీలు చెడిపోవడంతో షోకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషయంగానే ఉంది. ప్రస్తుతం ప్రసాద్ పూర్తిగా నడవలేని స్థితికి చేరుకున్నాడు.

ఇంట్లో తన పనులు కూడా తాను చేసుకోలేని దయనీయ స్థితికి చేరుకున్నాడు. జబర్దస్త్ కమెడియన్ నూకరాజు , అసియా ఇద్దరూ కలిసి ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని తెలియజేశారు. పంచ్ ప్రసాద్ యూట్యూబ్ ఛానెల్ ద్వారానే ఓ ఎమోషనల్ వీడియోను పంచుకున్నాడు. గతకొద్దిరోజులు ఈ ఛానెల్ లో ఎలాంటి వీడియోలు రాకపోవడంతో.. ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి ఎంతలా పాడయందో తెలియజేశారు.

ప్రస్తుతం రెగ్యూలర్ గా డయాలసిస్ కొనసాగుతోంది. రీసెంట్ గా ట్రీట్ మెంట్ కు వెళ్లి వచ్చిన మరుసటి రోజు ప్రసాద్ మోకాలికి తీవ్రంగా నొప్పి కలిగింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లినా.. ఐదారుగు వైద్యులనూ కలిసినా ఏంటనేది తేల్చలేకపోతున్నారు. ప్రస్తుతం ప్రసాద్ రెండు కాళ్లు తీవ్రంగా వాచిపోవడంతో పాటు భరించలేని నొప్పితో నరకం చూస్తున్నాడు. ఇలాంటి దుర్భర స్థితిలో ఉన్న ప్రసాద్ ను చూస్తే కన్నీళ్లు ఆగడం కష్టమనే చెప్పాలి. కదిలినా. . మెదిలినా విపరీతంగా పెయిన్ వస్తుండటం బాధాకరం. దీంతో ఆయన భార్యే ప్రసాద్ ను దగ్గరుండి చూసుకుంటుంది. వైద్యానికి డబ్బులు లేకపోవడంతో ఆర్థికసాయం కోరుతున్నారు. ఈకష్టకాలంలో అందరి మద్దతు కావాలని ప్రార్థిస్తున్నారు. మరోవైపు జబర్దస్త్ కమెడియన్స్ కూడా ప్రసాద్ కు తగిన విధంగా సాయం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కూడా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement