Thursday, November 7, 2024

TG: నా మ‌న‌మ‌రాలి వివాహానికి రండి.. సీఎంకు మల్లారెడ్డి ఆహ్వానం

హైద‌రాబాద్ – మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామ‌కూర మల్లారెడ్డి పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు. తన మనమరాలి మ్యారేజ్ నిమిత్తం ప్రముఖులను కలిసి పెళ్లి పత్రిక ఇస్తున్నారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులను స్వయంగా ఆహ్వానించారాయన.

తాజాగా బుధవారం ఉదయం సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి ఉన్నారు. తన మనమరాలి పెళ్లికి రావాలని కుటుంబ సమేతంగా రావాలని ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… తన మనమరాలి పెళ్లికి పిలిచేందుకు వచ్చానని, అంతే తప్ప ఇతర కారణాలేమీ లేవని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement