Thursday, April 18, 2024

తంక‌మ్ ప్ర‌మోష‌న్స్ లో అప‌ర్ణా బాల‌ముర‌ళి.. అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన విద్యార్థి

అప‌ర్ణా బాల‌ముర‌ళి ఈమె న‌టించిన సూరారై పొట్రు..తెలుగులో ఆకాశ‌మే నీ హ‌ద్దురా చిత్రంతో ఎన‌లేని గుర్తింపుని పొందింది. ఈ చిత్రంలో హీరో సూర్య .. తాజాగా తంకమ్ చిత్రంలో నటించింది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా కేరళలోని ఓ లా కాలేజిలో ఈవెంట్ ఏర్పాటు చేయగా, అపర్ణ బాలమురళి హాజరైంది. చిత్ర బృందంతో కలిసి అపర్ణ వేదికపై కూర్చుని ఉండగా, ఓ విద్యార్థి అనుచితంగా ప్రవర్తించడం కలకలం రేపింది. నేరుగా వేదికపైకి వచ్చిన ఆ కుర్రాడు అపర్ణ చేయి పట్టుకుని పైకి లేపి, ఆమె భుజం చుట్టూ చేయి వేసి ఫొటో దిగేందుకు ప్రయత్నించాడు. అయితే అపర్ణ సున్నితంగా అతడి చేయిని విడిపించుకుని తన సీట్లో కూర్చుంది. ఇతర యూనిట్ సభ్యులు చూస్తూ ఉండిపోయారు. ఇంతలో ఆ యువకుడు వేదిక దిగి వెళ్లిపోయాడు. ఇప్పుడీ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement