Monday, October 7, 2024

TG | హాస్టల్ లో కలెక్టర్ శశాంక బస.. విద్యార్థులతో కలిసి భోజనం

(ప్రభ న్యూస్ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి) : ఇబ్రహింపట్నం నియోజకవర్గంలోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల (బాలుర)ను జిల్లా కలెక్టర్ శశాంక ఆకస్మికంగా పర్యటించి హాస్టల్ లో బస చేశారు. సోమవారం రాత్రి వసతి గృహంలో బస చేసి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.

ముందుగా కలెక్టర్ పిజికల్ యాక్టవిటీ హాల్ లో విద్యార్థులు విజయాలతో సాధించిన పథకాలను పరిశీలించారు. వాటిని పరిశీలిస్తూ పాఠశాల పిటి, విద్యార్థులను అభినందించారు. హాస్టల్ లో ఉన్న లైబ్రరీని సందర్శించి రోజు వారి పత్రికలు ఎన్ని వస్తున్నాయని, విద్యార్ధులకు పత్రిక పేపర్ల వార్తలను ఎలా చదివిస్తున్నారు.. వారు ఎలాంటి నాలెడ్జ్ గెయిన్ అయితున్నారని అడిగి తెలుసుకున్నారు.

విద్యార్ధులు అనారోగ్యం పాలు కాకుండా తీసుకుకోవాల్సిన జాగ్రతలపై ఆరా తీస్తూ వెల్ నెస్ సెంటర్ ను పరిశీలించారు. విద్యార్థులకు కావాల్సిన మెడికల్ కిట్, ట్యాబ్లెట్లు, కనీస అవసరాలను మెయింటెయిన్ చేస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.

విద్యార్ధులు నైట్ స్టడీ విషయంలో స్టడీ రూంను పరిశీలించి, 6వ తరగతి విద్యార్ధులతో వారి టెక్స్ బుక్ లోని పాఠాలను చదివించారు. చదివిన విద్యార్థులకు మెరుగైన సూచనలు ఇచ్చారు. విద్యార్ధులకు అందించాల్సిన కనీస వసతులు, భోజనాల గూర్చి అడిగి తెలుకోన్నారు.

కంప్యూటర్ ల్యాబ్, స్పోర్ట్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. వారు ప్రత్యేకంగా చదువులో, క్రీడలలో ముందుండాలని తెలిపారు. వారు ఉన్నత శిఖరాలను చేరుకునే విధంగా తీర్చదిద్దాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -

అనంతరం భోజనం శాలను, వంట శాలను పరిశీలించి భోజన శాలలో భోజనాలు చేశారు. అనంతరం 10వ తరగతి విద్యార్ధులతో ముఖాముఖిగా అందరితో కలిసి కల్చరల్ యాక్టివీటీస్, విద్యార్థులో ఉన్న నైపున్యాన్లీ వెలికి తీసే దిశగా విద్యార్థులలో పాఠలు పాడటానికి ప్రోత్సహిందారు, అలాగే జర్నల్ నాలెడ్డు విషయాలను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు. రాబోయే రోజుల్లో మల్ల తిరిగి వెనకు చూసుకుంటే ఏమి కోల్పోయాం అనేది మీలో రాకూడదు అంటే మీరు ప్రత్యేక శ్రద్ధతో చదివి 10వ తరగతీలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకోవాలని తెలిపారు.

అనంతరం విద్యార్థులతో కలిసి విద్యార్థుల డార్మెంటరీలో బస చేశారు. ఈ పర్యవేక్షనలో సాంఘీక సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్ రామారావు, మల్టీ జోన్ 2 ఆఫీసర్ యన్ రజనీ, ప్రిన్సిపాల్ యం. వరోదిని, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకట్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement