Wednesday, February 8, 2023

మ‌రో వ్య‌క్తితో భార్య స‌హ‌జీవ‌నం.. క‌త్తితో గొంతుకోసిన చంపిన భ‌ర్త‌..

స‌హ‌జీవ‌నం చేస్తున్న మ‌హిళ హ‌త్యకు గురైన ఘ‌ట‌న న‌గ‌రంలోని మిర్యాల‌గూడ‌లో చోటుచేసుకుంది. రవి భార్య పందుల శారద(28) బాలానగర్‌ అంబిక కాలనీలో నివ‌సిస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన ఓ వ్య‌క్తితో, ఆమె ఏడు నెలల నుంచి సహజీవనం చేస్తున్నారు. శారదపై భ‌ర్త‌కు అనుమానం రావ‌డంతో బుధవారం ఉదయం కత్తితో గొంతుకోసి చంపేశాడు. మృతదేహాన్ని ఇంట్లో ఉంచి తాళం వేసి పారిపోయాడు. గది నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు బాలానగర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement