Thursday, November 7, 2024

China Open Tennis | విజేత కోకో గాఫ్..

చైనా ఓపెన్‌ డబ్ల్యూటీఏ 1000 సిరీస్‌ టెన్నిస్‌ టోర్నీ విజేతగా అమెరికా యువ స్టార్‌ కోకో గాఫ్‌ నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో నాలుగో సీడ్‌ గాఫ్‌ (అమెరికా) 6-1, 6-3 తేడాతో కారోలినా ముచువా (చెచియా)ను వరుస సెట్లలో చిత్తు చేసి కెరీర్‌ రెండో డబ్ల్యూటీఏ -1000 టైటిల్‌ కైవసం చేసుకుంది.

అంతకుముందు గతేడాది సిన్నినాటీ 1000 సిరీస్‌ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ టోర్నీ ఫైనల్‌లోనూ ముచోవాను ఓడించి టైటిల్‌ గెలుచుకోవడం విశేషం. కాగా, ఈ ఏడాది గాఫ్‌కు ఇది రెండో ట్రోఫీ. జనవరిలో ఆక్లాండ్‌ టెన్నిస్‌ టోర్నీలో విజేతగా నిలిచింది. కానీ, మేజర్‌ టోర్నీల్లో మాత్రం నిరాశ పరిచింది. గతేడాది యూఎస్‌ ఓపెన్‌ ఛాంపియన్‌గా నిలిచిన గాఫ్‌ అప్పటి నుంచి మరో గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ను మాత్రం గెలవలేక పోయింది.

ఇక ఈ మ్యాచ్‌ విషయానికి వస్తే.. అమెరికా యువ స్టార్‌ ఆది నుంచే దూకుడైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ముచోవాపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మ్యాచ్‌ను ఏకపక్షంగా సొంతం చేసుకుని చైనా ఓపెన్‌ కిరీటాన్ని ముద్దాడింది. మరోవైపు సెమీస్‌లో పారిస్‌ ఒలింపిక్‌ విజేత కిన్‌వెన్‌ జెంగ్‌పై, క్వార్టర్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ అరినా సబలెంకాపై సంచలన విజయాలు సాధించిన కారోలినా ముచోవా ఫైనల్లో మాత్రం పూర్తిగా తేలిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement