Friday, April 26, 2024

లైగ‌ర్ నుంచి మ‌రో అప్‌డేట్‌, కోకా 2.0 పాట రిలీజ్‌.. ఆక‌ట్టుకున్న విజ‌య్‌, అన‌న్య‌పాండే

విజయ్ దేవరకొండ.. అనన్య పాండే జంటగా నటించిన ‘లైగర్’ సినిమా నుంచి మ‌రో పాట ‘కోకా 2.0’ కొద్ది సేప‌టి క్రితం రిలీజ్ అయ్యింది. ఈ పాటలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే డిఫరెంట్ స్టైల్‌లో కనిపించారు. పాట షూటింగ్ చాలా బాగా జరిగింది. పాట పంజాబీ ఫ్లేవర్‌లో ఉండటంతో విజయ్ దేవరకొండ, అనన్య పాండే కూడా పంజాబీ లుక్‌లో అదిరిపోయారు. విజయ్ దేవరకొండ తలపాగా, మెరూన్ కలర్ పంజాబీ డ్రెస్ లో క‌నిపించ‌గా, అనన్య కూడా మెరూన్ లెహంగాలో క‌నిపిస్తోంది.

కాగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ తెరకెక్కుతోంది. విజయ్ దేవరకొండ, అనన్య పాండేతో పాటు రమ్య కృష్ణన్, రోనిత్ రాయ్, మకరంద్ దేశ్‌పాండే, గెటప్ శ్రీనుతో పాటు ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ కూడా ఈ మూవీలో కనిపించనున్నారు. ఇది ఈనెల 25న‌ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

YouTube video

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement