Monday, December 9, 2024

మీరు నిరుద్యోగులా? అయితే 1,086 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి

ప్రభుత్వరంగ సంస్థ కోల్‌ ఇండియా లిమిటెడ్‌కు చెందిన ఈస్టర్న్‌ కోల్‌ఫీల్డ్‌ లిమిటెడ్‌ (ఈసీఎల్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1086 సెక్యూరిటీ గార్డు పోస్టులను భర్తీ చేస్తున్నది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపికచేయనుంది. కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని వెల్లడించింది. ఎంపికైనవారిని జనరల్‌ మేనేజర్‌ ఆఫీసులు, సీనియర్‌ మేనేజర్‌ ఆఫీసుల ఈసీఎల్‌ పర్సనల్‌ డిపార్టమెంట్‌ వద్ద నియమిస్తారు.

మొత్తం పోస్టులు 1,086 ఉన్నాయి. ఇందులో జనరల్‌ 842, ఎస్సీ 163, ఎస్టీ 81 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: అభ్యర్థులు ఏడో తరగతి పాస్ అయ్యి ఉండాలి
ఎంపిక విధానం: ఫిజికల్‌ టెస్ట్‌ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తులను అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని పూర్తిగా నింపి ఈ-మెయిల్‌ చేయాలి.
ఈ-మెయిల్‌: [email protected]
దరఖాస్తులకు చివరితేదీ: జూన్‌ 15
వెబ్‌సైట్‌: http://www.easterncoal.gov.in/

Advertisement

తాజా వార్తలు

Advertisement