Wednesday, October 2, 2024

TG | స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం ఫోక‌స్… రేపు సీఎల్పీ భేటీ..!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన విధులు, విధివిధానాలపై చర్చించనున్నారు.

మండల స్థాయి నుంచి కొత్త కమిటీల నియామకం, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, వివిధ స్థాయిల్లో పార్టీ నేతల మధ్య సమన్వయం ఏర్పరచడంపై చర్చించనున్నారు.

సీఎల్పీ సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాస్ మున్షీ, ఏఐసీసీ అధికారులు విశ్వనాథ్, విష్ణునాథ్, కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement