Friday, October 4, 2024

TG | దత్త మంటపం ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్

హైదరాబాద్ దుండిగల్ అవధూత దత్తపీఠంలో దత్తమండపం ప్రారంభోత్సవం (బుధవారం) అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ… గతంలో తాను ఇదే ప్రాంతానికి పార్లమెంటు సభ్యునిగా ప్రాతినిధ్యం వహించానని…. ఇక్కడి నుంచే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిందన్నారు. అవధూత దత్తపీఠాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారి ప్రజలందరికీ ఉపయోగపడాలని ఆకాంక్షించారు.

ఈ కార్య‌క్ర‌మంలో దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement