Wednesday, April 17, 2024

Telangana | గవర్నర్ల ప్రవర్తనపై సీఎం కేసీఆర్ రియాక్ట్​.. పార్లమెంట్​లో తీవ్రంగా వ్యతిరేకించాలని ఎంపీలకు సూచన

బీజేపీ ప్రభుత్వం ఫెడరల్ స్పూర్తికి తూట్లు పొడుస్తూ, రాష్ట్రాలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నదని సీఎం కేసీఆర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు ఆర్థికంగా అనేక రకాలుగా ఆటంకాలు సృష్టిస్తూ ప్రగతిని అడ్డుకుంటున్నదన్నారు. పార్లమెంట్​ సమావేశాల సందర్భంగా బీఆర్​ఎస్​ వ్యవహరించే తీరుపై ఇవ్వాల ఆయన ఎంపీలకు దిశానిర్ధేశం చేశారు.

గవర్నర్ల వ్యవస్థను కూడా కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని సీఎం కేసీఆర్​ అన్నారు. రాష్ట్రాలను నిర్వీర్యపరిచే దిశగా గవర్నర్లను కేంద్రం తమ చెప్పుచేతుల్లో పెట్టుకోవడం అప్రజాస్వామికం​ అన్నారు. రాజ్యాంగబద్ధమైన విధునుల నిర్వర్తిస్తూ కేంద్ర రాష్ట్రాల నడుమ సంధాన కర్తలుగా గవర్నర్లు ఉండాలని, కానీ, రాష్ట్ర కేబినెట్ సహా, అత్యున్నత సభలైన శాసన సభ, శాసన మండలి తీసుకున్న నిర్ణయాలను ఉద్దేశపూర్వకంగా పెండింగులో పెడుతూ గవర్నర్లు బేఖాతరు చేస్తున్నారన్నారు.

ఇక.. గవర్నర్ల వ్యవస్థను బీజేపీ తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నదుర్మార్గ విధానాలను బీఆర్ఎస్ ఎంపీలుగా ఉభయ సభల్లో తీవ్రంగా వ్యతిరేకించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును ప్రభావితం చేయాలని, అభివృద్ధిని పాలనను అడ్డుకోవాలని చూస్తున్న గవర్నర్ల అప్రజాస్వామిక విధానాలపై ఫైట్ చేయాలని ఎంపీలకు దిశానిర్ధేశం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement