Wednesday, April 24, 2024

పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం : మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి

పేదల సంక్షేమమే పరమావధిగా సీఎం కేసీఆర్‌ కొత్త పెన్షన్లు మంజూరు చేస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నార‌ని మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి అన్నారు. వేల్పూరు, మోర్తాడ్, బాల్కొండ మండల కేంద్రాల్లో మంగళవారం మంత్రి వేముల లబ్ధిదారులకు పెన్షన్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు తదితర వర్గాల వారికి పెన్షన్లను పంపిణీ చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ తరహాలో దేశంలోని మరే ఇతర రాష్ట్రాల్లో పెన్షన్ల పంపిణీ జరగడం లేదని ఆయన తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలో ఇప్పటికే 52 వేల మందికి ఆసరా పెన్షన్లు అందుతుండగా, కొత్తగా 10 వేల మందికి పెన్షన్ల జాబితాలో చోటు కల్పించారన్నారు. వ‌యసు పైబడిన వారు చివరి దశలో ఇతరులపై ఆధారపడకుండా గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు 57 సంవత్సరాలు నిండిన వారికి కూడా పెన్షన్లు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement