Thursday, September 16, 2021

ఈనెల 13న ద‌ళిత బంధుపై స‌న్నాహ‌క స‌మావేశం

దళితబంధును పైలట్ ప్రాజెక్టుగా అమలు పరచనున్న నాలుగు మండలాల్లో పథకం అమలు కోసం ఈ నెల 13న మ‌ధ్యాహ్నం 2:30 గంట‌ల‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సన్నాహక సమావేశాన్ని నిర్వ‌హించాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించారు. దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంతో పాటు మధిర నియోజక వర్గంలోని చింతకాని మండలం, తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమ‌ల‌గిరి మండలం, అచ్చంపేట నియోజ‌క‌వ‌ర్గంలోని చారగొండ మండలం, జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపడుతామని ఇటీవలే సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలుకు సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణ కోసం దళిత బంధు పథకం అమలు సన్నాహక సమావేశాన్ని నిర్వహించనున్నట్టు సీఎం తెలిపారు.

సోమవారం జరగనున్న ఈ సన్నాహక సమావేశంలో ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన మంత్రులు, జిల్లాపరిషత్ చైర్మన్లు, కలెక్టర్లు, మధిర, తుంగతుర్తి, అచ్చంపేట, కల్వకుర్తి, జుక్కల్ నియోజవర్గాల శాసన సభ్యులు, ఎస్సీ కులాల అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఎస్సీ డెవలప్ మెంట్ శాఖ కార్యదర్శి, సీఎం సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఫెనాన్స్ సెక్రటరీ పాల్గొంటారు. పథకం తీరుతెన్నులను వివరించేందుకు క్షేత్రస్థాయి అనుభవం కలిగిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఆహ్వానితులుగా పొల్గొంటారని సీఎం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News