Wednesday, April 24, 2024

ధాన్యం ఉత్ప‌త్తి పెరగాలి: సీఎం కేసీఆర్

తెలంగాణలోని రైతాంగానికి పంట పెట్టుబ‌డి సాయం రైతు బంధు స‌హా స‌కాలంలో ఎరువులు, విత్త‌నాల‌ను అందిస్తున్నామ‌ని సీఎం కేసీఆర్ అన్నారు. వ్య‌వ‌సాయ‌, రైతు సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌భుత్వం చేప‌ట్టింద‌న్నారు. బుధ‌వారం జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో సీఎం కేసీఆర్ మంత్రుల‌తో ప్ర‌స్తావించారు. గ‌తేడాది తెలంగాణ‌లో రికార్డు స్థాయిలో 3 కోట్ల ట‌న్నుల ధాన్యం ఉత్ప‌త్తి చేశారని తెలిపారు. కరోనా క‌ష్ట‌కాలంలో రైతుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా.. గ్రామాల్లోకి వెళ్లి ప్ర‌భుత్వ‌మే ధాన్యాన్ని కొనుగోలు చేసింద‌న్నారు. తెలంగాణ రైతులు మరింత ఉత్సాహంతో వరిధాన్యాన్ని పండించే పరిస్థుతులు రాష్ట్రంలో నెలకొన్నాయని తెలిపారు. వచ్చే సంవత్సరం ధాన్యం ఉత్పత్తి మరింతగా పెరిగే అవకాశాలున్నాయని చెప్పారు. అందుకు అనుగుణంగా ధాన్యం నిల్వ చేయడం, మార్కెటింగ్ చేయడం పై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ప్రస్తుత వానాకాలం కోటీ నలభై లక్షల ఎకరాల్లో వ్యవసాయ సాగు జరగనుందని చెప్పారు. వరి పత్తి పంటలు రికార్డుస్థాయిలో పండ‌నున్నాయ‌ని సీఎం తెలిపారు. రాష్ట్రంలో వున్న ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవాలన్నారు. రైస్ మిల్లులలో మిల్లింగ్ సామ‌ర్థ్యాన్ని పెంచుకోవాలని, నూతనంగా రైస్ మిల్లులు, పారబాయిల్డ్ మిల్లులను గణనీయంగా స్థాపించాలని సీఎం సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement