Thursday, April 25, 2024

కడప జిల్లాలో క్రికెట్ ఆడిన సీఎం జగన్.. వీడియో వైరల్

సీఎంగా జగన్ ఎంత బిజీగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఆయన బయటి ప్రపంచంలో ఉల్లాసంగా గడిపే క్షణాలు చాలా తక్కువని చెప్పాలి. ఎప్పుడూ ప్రభుత్వ కార్యకలాపాలు, పార్టీ వ్యవహారాలు, ప్రజా సంబంధ విషయాలతో తలమునకలుగా ఉంటారు. అయితే శుక్రవారం నాడు కడప జిల్లా పర్యటనలో భాగంగా తన తాతగారైన వైఎస్ రాజారెడ్డి పేరిట నిర్మితమవైన వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియంలో సరదాగా క్రికెట్ ఆడారు. ఈ నూతన స్టేడియంలో సీఎం జగన్ నేడు ఫ్లడ్ లైట్ల ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా బ్యాట్ పట్టిన సీఎం జగన్ క్రికెట్ ఆడారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. సీఎం జగన్‌కు క్రికెట్‌లో నైపుణ్యం ఉన్నట్టు వీడియో క్లిప్పింగ్ చెబుతోంది. బ్యాటింగ్ స్టాన్స్, గ్రిప్, ఆయన బంతులను లెగ్ సైడ్ వైపు తరలించిన విధానం అన్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. సీఎం జగన్ పక్కా క్రికెటింగ్ షాట్లు ప్రదర్శించడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. వన్ మోర్, వన్ మోర్ అంటూ మరికొన్ని బంతులు ఆడాలని ఆయనను ఉత్సాహపరిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement