Friday, April 19, 2024

రాష్ట్రంతో మూడు ముక్కలాడుతున్న సీఎం జగన్ : టీడీపీ అధినేత చంద్రబాబు

రాష్ట్రంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు ముక్కలాట ఆడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. కర్నూలు జిల్లా పర్యటనలో బుధవారం ఆయన ఓర్వకలు ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన తెదేపా శ్రేణులు, విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు వారిని ఉద్దేశించి మాట్లాడారు. టీడీపీ హయాంలో గత ఐదేళ్లలో రాష్ట్రంలో 16 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయన్నారు. అవి కొనసాగి ఉంటే నేడు రాష్ట్రంలో 30 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేవన్నారు, తన హాయంలో ఆరు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ఉద్యోగాల కోసం బెంగళూరు, తమిళనాడు, హైదరాబాద్ కు ఎందుకు వెళ్లాల్సి వస్తుందని ప్రశ్నించారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎయిర్ పోర్టు ఎవరు కట్టారన్నారు. కర్నూల్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్ కోసం 10 వేల ఎకరాలు ఇచ్చామన్నారు. ఈ ఇండస్ట్రియల్ హబ్ వస్తే ఇక్కడున్న ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.

కర్నూలు జిల్లాకు సీడ్ పార్క్ తెచ్చామని, సోలార్ పార్క్ తెస్తే కమీషన్‌ల కోసం జగన్ రెడ్డి నిలిపివేశారని.. అది సెట్ చేసుకుని మళ్లీ ప్రారంభించారని చంద్రబాబు తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. తన పరిపాలనలో లోపాలను గుర్తించిన జగన్మోహన్ రెడ్డి వాటిని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అభివృద్ధికి టీడీపీ మారుపేరన్నారు. కర్నూలు జిల్లాలో ప్రతి కార్యక్రమం టీడీపీ హయాంలోనే జరిగిందన్నారు. హైదరాబాద్ లో ఉన్న తెలంగాణ కంటే ఏపీ అభివృద్ధి చెందాలని అనుకున్నామని, అందుకే అమరావతి తలపెట్టామని స్పష్టం చేశారు. నాడు వైఎస్సార్ హైటెక్ సిటీ కూల్చివేసి ఉంటే తరువాత అభివృద్ధి జరిగేదా? తమ్ముళ్లు అంటే ప్రశ్నించారు. యువతలో చైతన్యం రావాలని, వాస్తవాలు ప్రజలకు చెప్పాలన్నారు. ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఉంటుందా.. అంటే ఒక ఏపీ మాత్రమే అన్నారు. తన స్వార్థం కోసం, కేసుల మాఫీ కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంతో మూడు ముక్కలాట ఆడుతున్నారని.. ఎద్దేవస్ చేశారు.నాడు వైఎస్సార్ హైటెక్ సిటీ కూల్చివేసి ఉంటే తరువాత అభివృద్ధి జరిగేదా? అని అన్నారు. కర్నూల్ జిల్లాలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు నిలిపివేశారని విమర్శించారు. జగన్ రెడ్డి తండ్రి వైఎస్‌ను కూడా గౌరవించలేదని, అయన తెచ్చిన వేమన యూనివర్సిటీలో వేమన విగ్రహం తొలగించారన్నారు. కర్నూల్‌లో పరిశ్రమలు రావాలని 10 వేల ఎకరాలలో టౌన్ షిప్ తెచ్చామన్నారు. నాడు సోలార్ ప్రాజెక్టులు తెచ్చి ఉపాధి కల్పించామన్నారు. నేడు రాయలసీమ యూనివర్సిటీలో సిబ్బందికి కనీసం జీతాలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాంగోపాల్ రెడ్డిని గెలిపించమని కోరారు. యువత భవితకు తనది భరోసా అని చంద్రబాబు స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement