Friday, May 20, 2022

ముగిసిన ఉద్యోగ సంఘాల భేటీ

నాలుగు ఉద్యోగ సంఘాల నేతలు ఐక్య కార్యాచరణ కోసం హాజరైయ్యారు. భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను తయారుచేశారు ఉద్యోగ సంఘాలు.. ఈ మేర‌కు సమ్మెకే మొగ్గు చూపారు ఉద్యోగ సంఘాలు.. సోమవారం సమ్మె నోటీసు ఇచ్చేందుకు సిద్ధమైయ్యాయి. ఫిబ్రవరి 7 లేదా 8 నుంచి నిరవధిక సమ్మె చేసే యోచనలో ఉన్నాయి ఉద్యోగ సంఘాలు. ఈ నెల 23న జిల్లా కేంద్రాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నెల 25న జిల్లా కేంద్రాలలో ర్యాలీలు, ధర్నాలు జ‌రుగుతాయి.ఈ నెల 26 న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాల సమర్పణ కార్య‌క్ర‌మం ఉంటుంది. ఈ నెల 27 నుంచి 30 వరకు నిరాహార దీక్షలు కొన‌సాగుతాయి. ఫిబ్రవరి 3న ఛలో విజయవాడ కార్య‌క్ర‌మం ఉంటుంది. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల నేతలు సోమవారం నాడు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 5నుంచి సహాయనిరాకరణ కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌నున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement