Thursday, April 25, 2024

IPL | క్లాసెన్ మాస్ హిట్టింగ్.. బెంగ‌ళూరు టార్గెట్ ఎంతంటే!

ఐపీఎల్ 2023.. 16వ సీజ‌న్లో భాగంగా ఇవ్వాల రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్​ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్​ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది బెంగ‌ళూరు. కాగా, మెద‌ట‌ బ్యాటింగ్ కు దిగిన హైద‌రాబాద్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 ప‌రుగులు చేసింది. దీంతో బెంగ‌ళూరు ముందు 187 ప‌రుగుల టార్గెట్​ ని సెట్ చేయ‌గ‌లిగింది.

హైద‌రాబాద్లో టీమ్ లో అత్య‌ధికంగా హెన్రిచ్ క్లాసెన్ తన మాస్ హిట్టింగ్ తో 51 బంతుల్లో 104 ప‌రుగుల‌(8 ఫోర్లు, 6 సిక్స్ లు)తో సెంచ‌రీ కొట్టాగా.. బ్రూక్ 19 బంతుల్లో 27 పరుగులు చేశాడు. మిగిలిన వారు ఎవ్వ‌రూ అంత‌గా మెప్పించ‌లేక‌పోయారు. కాగా, మరి కొద్ది సేపట్లో లక్ష చేధనకు దిగనునున్న బెంగళూరు జట్టు ఈ మ్యాచ్ గెలవాలి అంటే నిర్ణీత 120 బంతుల్లో 187 పరుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement