Friday, May 20, 2022

స‌లార్ పై క్లారిటీ.. రిలీజ్ అప్పుడేన‌ట‌..

పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న ప్ర‌భాస్ చేతిలో ప్ర‌స్తుతం ఉన్న సినిమాలు ఆది పురుష్‌, స‌లార్‌, ప్రాజెక్ట్ కె, స్పిరిట్. వీటిలో ఆది పురుష్ వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుని నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. ఇక.. ప్ర‌భాస్ లిస్టులో ఉన్న సినిమాల్లో స‌లార్‌పై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్ పీక్స్‌లో ఉన్నాయి.

అయితే.. చివ‌ర‌కు ఓ క్లారిటీ వ‌చ్చేసింది. స‌లార్ సినిమాను నిర్మిస్తున్న సంస్థ హోంబెల్ ఫిలిమ్స్ అధినేత విజ‌య్ కిర‌గందూర్ రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ఇప్ప‌టి దాకా స‌లార్ 35 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుందని వెల్ల‌డించారు. త్వ‌ర‌లోనే కొత్త షెడ్యూల్‌ను స్టార్ట్ చేయ‌బోతున్నామ‌ని అక్టోబ‌ర్ లేదా న‌వంబ‌ర్ వరకు చిత్రీక‌ర‌ణ పూర్తి చేసేలా ప్లాన్ చేశామ‌ని అన్నారు. దీంతో 2023 స‌మ్మ‌ర్‌లో స‌లార్ సంద‌డి ఉంటుంద‌ని డార్లింగ్​ ప్రభాస్​ ఫ్యాన్స్​ ఇప్పుడే సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement