Saturday, April 20, 2024

గోపీచంద్ 31వ చిత్రానికి క్లాప్

హీరో గోపీచంద్‌ తన 31వ చిత్రం కోసం ప్ర ముఖ కన్నడ దర్శకు డు ఎ హర్షతో చేతులు కలిపారు. శ్రీ సత్యసా యి ఆర్ట్స్‌ నుంచి ప్రొడ క్షన్‌ అధినేత కెకె రాధా మోహన్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఈ యాక్షన్‌ ఎంటర్‌-టైనర్‌ సినిమా పూజా కార్యక్రమాలు చిత్ర యూనిట్‌ సమక్షంలో హైదరాబాద్‌లో లాంఛనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత రాధామోహన్‌ మాట్లాడుతూ ”మా తాజా చిత్రంలో హీరో గోపీచంద్‌, దర్శకుడు హర్షతో కలసి పని చేయడం ఆనందంగా ఉంది. ఈ నెలలోనే సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది” అన్నారు.
కన్నడలో పలు విజయవంతమైన చిత్రాలను అందించిన హర్ష, ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. గోపీచంద్‌కు ఇది పూర్తిగా భిన్నంగా ఉంటు-ంది. ఈ చిత్రానికి స్వామి జే సినిమాటోగ్రాఫర్‌ కాగా, కేజీఎఫ్‌ ఫేమ్‌ రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement