Thursday, April 18, 2024

పార్లమెంట్‌‌పై కీలక వ్యాఖ్యలు చేసిన సీజేఐ ఎన్వీ రమణ

పార్లమెంట్‌పై సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌లో చట్టాలపై చర్చ జరగకపోవడంపై చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ అసహనం వ్యక్తం చేశారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్‌ ఎన్వీ రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన చర్చ లేకపోవడంతో న్యాయపరమైన చిక్కులు ఏర్పడతాయని స్పష్టం చేశారు.

పార్లమెంట్‌లో చర్చ జరగకపోవడం వల్ల కొత్త చట్టాల అసలు ఉద్దేశం ఏమిటో ప్రజలకు తెలియకుండానే పోతుందని మండి పడ్డారు. చట్టాల తయారీలో నాణ్యతా లోపం లిటిగేషన్లకు దారి తీస్తోందన్నారు. కొన్ని చట్టాలను కోర్టులు కూడా సరిగా అర్థం చేసుకోలేక పోతున్నాయని ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. చట్ట సభల్లో మేధావులు, న్యాయవాదులు లేకపోతే.. ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని చురకలు అంటించారు. ప్రజా జీవితంలో చురుకుగా ఉండాలని నాయకులకు ఎన్వీరమణ హితవు పలికారు.

ఈ వార్త కూడా చదవండి: దేశభక్తి చాటిన రైతు.. వరిపొలంలోనే భారతదేశ పటం

Advertisement

తాజా వార్తలు

Advertisement