Thursday, April 25, 2024

జస్టిస్ NV రమణ కెరీర్‌లో కీలక తీర్పులు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న తెలుగు వ్యక్తి జస్టిస్​ ఎన్​.వి. రమణకు 2014లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. అప్పటి నుంచి అనేక కీలకమైన అంశాలను విచారించిన ధర్మాసనాల్లో సభ్యుడిగా ఉన్నారు. న్యాయమూర్తిగా ఆయన వెల్లడించిన కొన్ని కీలక తీర్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

✪ ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణ వేగవంతం చేయాలి
ప్రజాప్రతినిధులపై సుదీర్ఘ కాలంగా పరిష్కారం కాని క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేయాలని 2020, సెప్టెంబర్ 17న జస్టిస్‌ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పును వెల్లడించింది.

✪ ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలపై విధించిన ఆంక్షలు భావప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధం
ఆర్టికల్ 370 రద్దు సమయంలో జమ్మూ కాశ్మీర్‌లో టెలికాం, ఇంటర్నెట్ సేవలపై విధించిన ఆంక్షలు భావప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కల్గిస్తున్నాయన్న జస్టిస్‌ ఎన్‌. వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులను వారం రోజుల్లో సమీక్షించాలని, వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలని తీర్పు వెల్లడించింది.

✪ ఆర్‌టీఐ పరిధిలోకి సీజేఐ కార్యాలయం
2019లో దాఖలైన ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా సమాచార హక్కు పరిధిలోకి వస్తుందని అప్పటి సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయి, జస్టిస్ ఎన్.వి. రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ దీపక్ గుప్తా, జస్టిస్‌ సంజీవ్ ఖన్నాతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెల్లడించింది.

✪ బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్‌లో మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయాలి
ఇంట్లో గృహిణులు చేసే పని.. ఆఫీసుల్లో వారి భర్తలు చేసే పనికి ఏమాత్రం తీసిపోదంటూ.. 2021 ఆరంభంలో జస్టిస్‌ ఎన్‌. వి. రమణ, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన సుప్రీం ధర్మాసనం తీర్పు వెల్లడించింది.

- Advertisement -

✪ నిర్భయ కేసులో దోషి పవన్‌ క్యూరేటివ్ పిటిషన్ కొట్టివేత
2012 ఢిల్లీ హత్యాచార ఘటన కేసులో దోషిగా తేలిన పవన్ కుమార్ గుప్తా మరణశిక్ష అమలుపై స్టే విధించాలంటూ వేసిన క్యురేటివ్ పిటిషన్‌ను రద్దు చేస్తూ జస్టిస్‌ ఎన్‌.వి. రమణతో కూడిన సుప్రీం ధర్మాసనం తీర్పు వెల్లడించింది.

✪ దేవాలయాల్లో అర్చకుల నియామకం, తొలగింపు.. ఆర్టికల్ 14 ఉల్లంఘన కిందికి రాదు
2016లో దాఖలైన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా దేవాలయాల్లో అర్చకులను నియమించడం లేదా తొలగించడం.. ఆర్టికల్ 14 ఉల్లంఘన కిందకు రాదని జస్టిస్ ఎన్‌.వి. రమణతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అర్చకుల నియామకం.. ఆగమశాస్త్రానికి అనుగుణంగా, రాజ్యాంగ పరమైన ఆదేశాలు, సూత్రాలకు అనుగుణంగా ఉండాలని తీర్పునిచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement