Friday, March 29, 2024

క్రిస్మ‌స్‌కు ఆఫర్ల మీద ఆఫ‌ర్లు.. ఆనందాన్ని పెంచుతున్న వండర్‌లా

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : భారతదేశపు అతిపెద్ద అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌గా ఖ్యాతిగడించిన వండర్‌లా హాలీడేస్‌ లిమిటెడ్‌, క్రిస్మస్‌ సంబరాలను వండర్‌లా హైదరాబాద్‌లో 24 డిసెంబర్‌ 2022 నుంచి 2023 జనవరి 1 వరకూ నిర్వహించబోతుంది. వారం రోజుల పాటు జరిగే ఈ వేడుకలలో లైవ్‌ షోస్‌, సీజనల్‌ స్వీట్స్ అండ్‌ ట్రీట్స్‌, పండుగ అలంకరణలు, ప్రకాశవంతమైన విద్యుత్‌ దీపాలు, ఫుడ్‌ ఫెస్ట్‌, వినోద క్రీడలు, డీజే, ప్రత్యేక ప్రదర్శనలు, మరెన్నో భాగంగా ఉంటాయి. వీటితో పాటుగా 45కు పైగా రైడ్స్‌, వండర్‌లాను అన్ని వయసుల వారికి అత్యుత్తమమైన ఒన్‌ డే డెస్టినేషన్‌గా మారుస్తాయి.

క్రిస్మస్‌ సంతోషాన్ని మరింతగా విస్తరించేందుకు, వండర్‌లా ఇప్పుడు ఎర్లీబర్డ్‌ ఆఫర్‌ ప్రకటించింది. దీనిలో భాగంగా ఐదు రోజుల ముందు టిక్కెట్లు బుక్‌ చేసుకున్న వారు 10శాతం రాయితీ పొందవచ్చు. అంతేకాదు, 22 సంవత్సరాల వయసులోపు కాలేజీ విద్యార్ధులు ఫ్లాట్‌ 20శాతం రాయితీని టిక్కెట్‌పై పొందవచ్చని ఆ సంస్థ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement