Friday, April 26, 2024

బొడిగె శోభ‌ ఓ పిచ్చి కుక్క- ఎమ్మెల్యే సుంకె

మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ‌పై చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ నిప్పులు చెరిగారు. రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం సీఎం కేసీఆర్ కుటుంబంపై బొడిగె శోభ దూష‌ణ‌ల‌కు పాల్ప‌డ‌టం శోచ‌నీయం అని అన్నారు. రాజ‌కీయ భిక్ష పెట్టిన సీఎం కేసీఆర్‌పై అవాస్త‌వాలు మాట్లాడితే స‌హించేది లేద‌ని హెచ్చ‌రించారు. బొడిగె శోభ పిచ్చి కుక్కలా మాట్లాడుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు.  చొప్ప‌దండి నియోజ‌క‌వ‌ర్గంలో బొడిగె శోభ ఓ చెల్ల‌ని నాణెం అని విమ‌ర్శించారు. నాడు శోభకు టికెట్ ఇచ్చినప్పుడు కేసీఆర్ దేవుడు అంటూ అన్నారని, ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.  చొప్ప‌దండిలో శోభ‌కు తొలిసారి టికెట్ ఇచ్చిన‌ప్పుడు కార్య‌క‌ర్త‌లు తీవ్రంగా వ్య‌తిరేకించారు. అయిన‌ప్ప‌టికీ అంద‌రికీ న‌చ్చజెప్పి.. శోభ‌ను కేసీఆర్ ఎమ్మెల్యేను చేశారు. అన్ని ర‌కాలుగా ఆద‌రించిన మాజీ ఎంపీ బోయిన్‌ప‌ల్లి వినోద్‌కుమార్‌పై అస‌త్యాలు మాట్లాడిన శోభ విజ్ఞ‌త ఏ పాటిదో తెలుస్తోంద‌ని సుంకె రవిశంకర్‌ చెప్పారు. బీజేపీ టికెట్ ఇవ్వదని తెలిస్తే మళ్లీ ఆపార్టీని కూడా తిడుతుందన్నారు. బోడిగె శోభ వైఖరి నిచూసి మహిళలు తలవంచుకుంటున్నారని పేర్కొన్నారు. పధ్ధతి మార్చుకోకపోతే…చీపుర్లతో తరిమి కొడుతామని సుంకె రవిశంకర్ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement