Saturday, April 20, 2024

దిల్ రాజు, వేణు శ్రీ రామ్ లను అభినందించిన చిరంజీవి

వకీల్ సాబ్ మూవీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి టాక్ తో దూసుకుపోతోంది. దీనికి పవన్ కళ్యాణ్ క్రేజ్ కూడా తోడవడంతో కలెక్షన్లు కొల్లగొడుతోంది. కుటుంబ సమేతంగా వకీల్ సాబ్ ని చూసిన చిరంజీవి..చిత్రంపై ప్రశంసలు కురిపించారు. తాజాగా చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్, నిర్మాత దిల్ రాజులను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. వారిద్దరినీ తన నివాసానికి ఆహ్వానించిన చిరంజీవి వారితో తన ఆనందాన్ని పంచుకున్నారు. వకీల్ సాబ్ చిత్రాన్ని తన తల్లి, ఇతర కుటుంబసభ్యులతో చిరంజీవి నిన్న హైదరాబాదులోని ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్సులో తిలకించడం తెలిసిందే. సినిమాలో పవన్ సహా ప్రతి ఒక్కరి నటన అద్భుతంగా ఉందని ఆయన కితాబిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement