Tuesday, March 19, 2024

బ్ర‌హ్మానందం న‌ట‌న‌పై..చిరంజీవి.. రామ్ చ‌ర‌ణ్‌ ప్ర‌శంస‌లు

చాలా గ్యాప్ త‌ర్వాత కృష్ణ‌వంశీ తెరకెక్కించిన చిత్రం రంగ‌మార్తాండ‌. ఈ చిత్రంపై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. కాగా ఎక్కువగా నవ్వులతోనే అభినందనలు అందుకున్నారు స్టార్ న‌టుడు బ్ర‌హ్మ‌నందం. అలాంటి ఆయన ‘రంగమార్తాండ’ సినిమాతో ఏడిపించేశారు. రంగస్థల నటుడిగా .. వృద్ధాప్యంలో భార్య తోడు లేకుండా ఒంటరి జీవితాన్ని గడపలేని చక్రపాణి పాత్రలో బ్రహ్మానందం తన నట విశ్వరూపం చూపించారు.

మన కోసం ఎదురుచూసేవారు లేనప్పుడు మరణించడమే సుఖం’ అంటూ హాస్పిటల్ సీన్ లో ఆయన కన్నీళ్లు పెట్టించారు.ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ ఎమోషన్స్ ఉంటాయనే విషయం ప్రేక్షకులకు తెలుసు. కానీ బ్రహ్మానందం పాత్ర ఈ రేంజ్ లో ఏడిపిస్తుందనీ , ఈ పాత్రలో ఆయన ఇంతలా విజృంభిస్తారని గాని ఆడిటోరియం అనుకోలేదు. ఆయన నటన గురించే మరోసారి అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి – మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కూడా ఆయనను మనస్ఫూర్తిగా అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement