Wednesday, April 17, 2024

స్ట‌యిల్స్ లుక్ లో చిరంజీవి.. వాల్తేరు వీర‌య్య కొత్త పోస్ట‌ర్ రిలీజ్

పూర్తిస్థాయి మాస్ పాత్ర‌లో మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న చిత్రం వాల్తేరు వీర‌య్య‌.ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు బాబీ రూపొందిస్తున్నాడు. మాస్ మహారాజ రవితేజ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా దర్శకుడు బాబీ.. చిత్రం నుంచి మరో పోస్టర్ ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ప్యాంటు, చొక్కా వేసుకొని, కళ్ల జోడుతో పోలీస్ స్టేషన్ లో టేబుల్ పై చిరు స్టయిల్ గా కూర్చున్న పోస్టర్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇందులో చిరు ముందు ఓ తుపాకీ, వెనకాల వరుసగా మరికొన్ని తుపాకులు ఉన్నాయి. హ్యాండ్ కప్స్ ను ఒక చేతిలో పట్టుకున్న చిరు స్టిల్ అదిపోయింది.

ఈ పోస్టర్ శాంపిల్ మాత్రమేనని, ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ మొత్తం థియేటర్లలో పూనకాలు తెప్పించడం పక్కా అని బాబీ పేర్కొన్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. టీజర్, బాస్ పార్టీ లిరికల్ సాంగ్ తో పాటు రవితేజ క్యారెక్టర్ కి సంబంధించిన టీజర్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అవన్నీ ఈ చిత్రంపై అంచనాలను మరింత పెంచేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement