Saturday, April 20, 2024

చిరంజీవి ఆదుకున్నారు.. మిగతా ఏ హీరోలు సాయం చేయలేదు.. పావలా శ్యామలా

పాత్ర ఏదైనా తనదైనశైలిలో నటించడం పావలా శ్యామల ప్రత్యేకత. అలాంటి ఆమెకి ఈ మధ్య కాలంలో వేషాలు రావడం లేదు. అందుకు కారణం ఆమెకి వయసు పైబడటం. ఆమె కూతురు అనారోగ్యం బారిన పడటం. తాజా ఇంటర్వ్యూలో శ్యామల మాట్లాడుతూ .. నేను కష్టాల్లో ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు నన్ను ఆదుకున్నారు. తనే నాకు ‘మా’లో సభ్యత్వాన్ని ఇప్పించి, ప్రతినెలా నాకు కొంత మొత్తం వచ్చేలా చేశారు. ఆయన చేసిన సాయాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను. అయితే స్టార్ హీరోలు మహేశ్ బాబు .. ఎన్టీఆర్ .. ప్రభాస్ ..రామ్ చరణ్ వీరంతా కూడా తలా పది లక్షలు నాకు సహాయం చేసినట్టుగా .. నేను హాయిగా ఉన్నట్టుగా ఎవరో ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అందులో ఎంతమాత్రం నిజం లేదు. అలాంటి పుకార్ల వలన నాకు చిన్న చిన్న సాయాలు చేసేవారు కూడా వెనక్కి పోయారు. నాకు ఎలాంటి సాయం దక్కకూడదనే ఉద్దేశంతో ఒక మహాతల్లి ఇలా చేసిందని ఆమె ఆవేదనను వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement