Tuesday, April 23, 2024

మెగాస్టార్ ‘భోళాశంకర్’ షురూ

మెగాస్టార్ చిరంజీవి మరో కొత్త సినిమాను మొదలు పెట్టారు. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భోళాశంకర్’ చిత్రం నేడు పూజా కార్యక్రమాలు జరుపుకుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చిరంజీవిపై క్లాప్ కొట్టగా, మరో దర్శకుడు కొరటాల శివ స్క్రిప్టును చిత్రబృందానికి అందించారు. ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన ‘వేదాళం’ చిత్రాన్ని తెలుగులో ‘భోళాశంకర్’ గా రీమేక్ చేస్తున్నారు. ఇందులో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తోంది. కాగా, ఈ మూవి పూజ కార్యక్రమానికి హీరోయిన్ తమన్నా, దర్శకులు వంశీ పైడిపల్లి, హరీశ్ శంకర్, గోపీచంద్ మలినేని, వీవీ వినాయక్, బాబీ, సినీ ప్రముఖులు తదితరులు హాజరయ్యారు.


Advertisement

తాజా వార్తలు

Advertisement