Wednesday, April 17, 2024

చైనా ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. కరోనా ఆంక్షల సడలింపు

చైనాలో క‌రోనా విల‌య‌తాండ‌వం చేసిన విష‌యం తెలిసిందే. దీంతో చైనా ప్ర‌భుత్వం క‌ఠిన ఆంక్ష‌లు విధించింది. విదేశాల నుంచి వ‌చ్చే వారిని క్వారంటైన్ లో ఉంచుతున్న విష‌యం తెలిసిందే. అయితే క‌రోనా ఆంక్ష‌ల‌పై ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆంక్ష‌లు స‌డ‌లిస్తు ఉత్త‌ర్వులు జారీ చేసింది. జీరో కొవిడ్‌ విధానానికి స్వస్తి పలికేందుకు సిద్ధమైంది. విదేశీ ప్రయాణికులపై ఆంక్షలను తాజాగా ఎత్తివేసింది. ఇకపై విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ నిబంధన జనవరి 8 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. కరోనా వైరస్‌ నెగిటివ్‌ ధ్రువపత్రం చూపిస్తే చాలని పేర్కొంది. 48 గంటల ముందు కరోనా పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement