Wednesday, April 17, 2024

కోవిడ్‌ ఆంక్షలను సడలించిన చైనా.. భారతీయులకు పెద్ద ఉపశమనం

కోవిడ్‌ మహమ్మారి కారణంగా బీజింగ్‌ విధించిన కఠిన వీసా ఆంక్షల నేపథ్యంలో రెండేళ్లుగా భారత్‌లో చిక్కుకుపోయిన భారతీయ నిపుణులు, వారి కుటుంబాలకు వీసాలు అందించే ప్రణాళికలను చైనా ప్రకటించింది. చైనా విశ్వ విద్యాలయాల్లో చదువుతున్న వేలాది మంది భారతీయ విద్యార్థుల అభ్యర్థనలను కూడా చైనా పరిశీలిస్తోంది. వారు తమ కళాశాలలు, విశ్వ విద్యాలయాల్లో తిరిగి చేరడానికి తమ ఆసక్తిని తెలియజేస్తున్నారు. 2020 నుండి చైనాలో చిక్కుకు పో యిన వందలాది మంది భారతీయ నిపుణులు, వారి కుటుంబాలకు ఇది పెద్ద ఉపశ మనం.

గత నెలలో చైనాలో ఇరుక్కుపోయిన భారతీయ నిపుణులను తిరిగి భారత్‌ వచ్చేట్లు చేయాలని కోరుతూ భారత విదేశాంగమంత్రి జైశంకరన్‌ను బాధిత కుటుంబాలు కోరాయి. భారతీయులతో పాటు చైనా పౌరులు చైనాకు వెళ్లడానికి వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చైనారాయబారకార్యాలయం తెలిపింది. వీసా నిషేధాలు, విమాన రద్దు కారణంగా భారతీయులతో పాటు వివిధ కంపెనీలలో పనిచేస్తున్న చాలా మంది చైనా ఉద్యోగులు భారత దేశంలో చిక్కుకు పోయారు. భారతీయ విద్యార్థులు తిరిగి చైనా రావడానికి అక్కడి ప్రభుత్వం అంగీకరించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement