Saturday, April 20, 2024

ప్లాస్టిక్ బాటిల్ లో డీజిల్ తాగి చిన్నారి మృతి..

ప్లాస్టిక్ బాటిల్ లో ఉన్న డీజిల్ ను అభం శుభం తెలియ‌ని ఏడాదిన్న‌ర‌ ప‌సి బాబు తాగి మృతి చెందిన ఘ‌ట‌న ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. ఒక వ్యక్తి తన వాహనాన్ని రిపేర్ చేయించుకుని అందులోని డీజిల్‌ తీసి ఒక బాటిల్‌లో ఉంచాడు. అయితే ఇంట్లో ఆడుకుంటున్న ఆ వ్యక్తి కుమారుడు (ఏడాదిన్నర) బాలుడు పొరపాటున ఆ బాటిల్‌లోని డీజిల్‌ను తాగాడు. దీంతో తీవ్ర అస్వస్థతకు గుర‌వ్వ‌డంతో ఇది గ‌మ‌నించిన కుటుంబ స‌భ్యులు వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. బాబు పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. ఎంత‌కీ బాబు ప‌రిస్థితి మెరుగుపడక పోవ‌డంతో చేసేదేమీ లేక ప్రైవేట్‌ ఆసుపత్రిలో అడ్మిట్‌ చేశారు. బాలుడు చికిత్స పొందుతూ మరణించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement