Thursday, April 25, 2024

భారీగా తగ్గిన చికెన్ ధరలు..

ఇది నాన్ వెజ్ ప్రియులకి శుభవార్తననే చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య డిమాండ్‌ తగ్గడం, పొరుగు రాష్ట్రాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో గత నెల రోజుల్లోనే కిలో బ్రాయిలర్‌ కోడి మాంసం ధర రూ.270 నుంచి 150కి తగ్గింది. సభలు, సమావేశాలు, ఫంక్షన్లు జరగకపోవడంతో 70 శాతం మంది మాత్రమే చికెన్ కొంటున్నారు. దీనితో 30 శాతం డిమాండ్ పడిపోయిదని చెప్పాలి..ఉత్పత్తి ఎక్కువగా ఉండడంతో చికెన్‌ ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. కేవలం నెల రోజుల వ్యవధిలో వంద రూపాయలకు పైగా కోడి మాంసం ధర తగ్గిపోయింది. ఏప్రిల్‌లో రూ.270 దాకా వెళ్లి కిలో చికెన్‌ ధర.. ఈనెలలో అది రూ.150కు పడిపోయింది. నగరంలో ప్రస్తుతం లైవ్‌కోడి ధర రూ.100 పలుకుతోంది. గత నెలలో చికెన్‌ ధర కిలో అత్యధికంగా రూ.270, అత్యల్పంగా రూ.220 ఉండింది. అలాగే ఈనెల ఒకటిన రూ.144, నాలుగున రూ.145, ఆరో తేదీన రూ.150 పలికింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement