Thursday, December 5, 2024

Chhattisgarh: మావోల ఘాతుకం.. ఇన్‌ఫార్మర్ నెపంతో దారుణహత్య

మావోయిస్టులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. ముఖ్యంగా ఇన్ ఫార్మర్ అనే నెపంతో నిత్యం ఎవరినో ఒకరిని దారుణంగా హత్య చేసి.. అటవీ, గ్రామీణ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.

ఈ క్రమంలో మంగళవారం కూడా ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్‌ఫార్మర్ నెపంతో గ్రామస్థుడిని దారుణంగా హత్య చేశారు. జంగ్ల అటవీ ప్రాంతంలో ప్రజా కోర్టు నిర్వహించి హత్య చేశారు. ఈ హత్యను భైరం ఘడ్ ఏరియా కమిటీ మావోయిస్టులు ధ్రువీకరించారు. మృతుడు మత్వారాకు చెందిన మడివి దూలారుగా గుర్తించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement