Friday, June 25, 2021

కరోనా ఎఫెక్ట్: చెర్వుగట్టు ఆలయం మూసివేత

తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో నల్గొండ జిల్లాలోని ప్ర‌ముఖ దేవాల‌యం చెర్వుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల దర్శనాల‌ను అధికారులు నిలిపివేశారు. అమావాస్య సందర్భంగా ప్ర‌త్యేక‌ పూజలకు రామలింగేశ్వర స్వామి ఆలయం పేరుగాంచింది. అమావాస్య రోజున భారీ సంఖ్య‌లో భక్తులు ఆల‌యానికి వ‌స్తారు. ఈ నెల 11న అమ‌వాస్య ఉండ‌టంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో ఆదివారం నుంచి ఈనెల 18 వరకు ఆలయంలో భక్తులకు అనుమతి ఉండదని ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News