Friday, December 6, 2024

Chennai – త‌ల్లికి స‌రైన వైద్యం అందించని వైద్యుడిపై క‌త్తితో దాడి…

చెన్నై: తన తల్లికి సరిగా వైద్యం అందించలేదన్న కోపంతో ఓ యువకుడు వైద్యుడిపై దాడికి పాల్పడ్డాడు. పలుమార్లు పొడిచి, తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రి లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంకాలజీ విభాగంలో పనిచేస్తోన్నడాక్ట‌ర్ బాలాజీ జగన్నాథన్ పై ఈ దాడి జరిగింది. బుధవారం ఉదయం నిందితుడు పేషంట్‌లా వచ్చి, డాక్టర్‌ను కత్తితో పొడిచి పారిపోయేందుకు యత్నించాడు. మిగతా వైద్య సిబ్బంది అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నిందితుడి తల్లి ఈ ఆసుపత్రిలో క్యాన్సర్ చికిత్స తీసుకుంద‌ని, అయితే ఆమె పరిస్థితి మెరుగు పడకపోవడంతో చికిత్స అందించిన వైద్యుడు బాలాజీ జగన్నాథన్‌పై ఆమె కుమారుడు కక్ష పెంచుకుని ఈ ఘటనకు పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన వైద్యుడి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి డైరెక్టర్ వెల్లడించారు. ఈ దాడిని వైద్యులు తీవ్రంగా ఖండించారు.

దీనిపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన ఆయన.. విచారణకు ఆదేశించారు. సమయంతో నిమిత్తం లేకుండా సేవలు అందిస్తోన్న వైద్యుల కృషి ఎనలేనిదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ దాడితో వైద్యుల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement