Thursday, April 25, 2024

చెన్నై జలదిగ్బంధం, తమిళనాడులో రెడ్‌ అలర్ట్‌..

తమిళనాడులో వర్ష బీభత్సం కొనసాగుతోంది. రాష్ట్ర రాజధాని చెన్నై నగరం జగదిగ్బంధంలో చిక్కుకుంది. తమిళనాడులోని చాలా చోట్లకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. తిరువళ్లూరు, మదురై, శివగంగ, కాంచీపురం సహా పలు జిల్లాల్లో పాఠశాలలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. మదురై, కాంచీపురం, త్రివళ్లూరులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కాలేజీలను కూడా మూసివేయాలని నిర్ణయించారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చాలా ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లపై వరద ప్రవాహం కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఇప్పటికే తడిసిముద్దయిన తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో మళ్లి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఈ క్రమంలోనే ఆదివారం ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని చెన్నైతో పాటు రాష్ట్రంలోని అనేక ఇతర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది. దక్షిణాదిలోని పలు ప్రాంతాల్లో వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది.

ఆదివారం ఉదయం నుండి చెన్నై, దాని పొరుగు ప్రాంతాలలో వర్షం కురుస్తూనే ఉంది. శుక్రవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరువళ్లూరు, మదురై, శివగంగ, కాంచీపురం సహా పలు జిల్లాల్లో పాఠశాలలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు . మదురై, కాంచీపురం మరియు త్రివళ్లూరులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కాలేజీలను కూడా మూసివేయాలని కోరారు. అలాగే శివగంగ, దిండిగల్‌, తేని, రామనాథపురం జిల్లాల్లో వరద హెచ్చరికలను ఐఎండీ జారీ చేసింది. 4,230 క్యూబిక్‌ అడుగుల అదనపు నీటిని విడుదల చేసినట్లు తేనిలోని వైగం డ్యామ్‌ సైట్‌ నుండి అధికారి ఒకరు తెలిపినట్టు ఏఎన్‌ఐ నివేదించింది.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. చెన్నై తో పాటు పలు ప్రాంతాల్లో రేపు వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశముంది. తమిళనాడు, పరిసర ప్రాంతాలలో తుఫాను సర్క్యులేషన్‌ ఉందనీ, ఈ వ్యవస్థ నుండి ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు దిగువమ్ఖధ్య ట్రోపోస్పిరిక్‌ స్థాయిలలో ద్రోణి నడుస్తోందని ఐఎండీ అంతకుముందు పేర్కొంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందనీ, ఇది తీవ్ర అల్పపీడనంగా దక్షిణ రాష్ట్రం, పుదుచ్చేరి తీరం వైపు వెళ్లే అవకాశం ఉందనీ, దీని కారణంగా నవంబర్‌ 15 వరకు రెండు ప్రాంతాల తీరప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు అక్టోబర్‌ 29న ప్రారంభమవుతాయని గత నెలలో చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం (ఆర్‌ఎంసీ) ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement