Sunday, October 6, 2024

Chennai పోర్టులో రూ.110 కోట్ల విలువైన డ్ర‌గ్స్ ప‌ట్టివేత

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, చెన్నై : దేశవ్యాప్తంగా డ్రగ్స్ వినియోగం బాగా పెరిగిపోతుంది. దీంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అన్ని రాష్ట్ర సర్కార్ లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి అక్రమంగా వస్తున్న డగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని సూచనలు చేసింది. దీంతో దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్టులు, ఓడరేవుల వద్ద కస్టమ్స్ అధికారులు విసృతంగా తనిఖీ చేస్తున్నారు. డౌట్ వచ్చిన ప్రతి లాగేజీలు, కంటైనర్లను మొత్తం చెక్ చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఈ రోజు తెల్లవారుజామున చెన్నై పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీ మొత్తంలో డ్రగ్స్‌ను సీజ్ చేశారు. ఓ ముఠా కంటైనర్‌లో అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న దాదాపు 110 కోట్ల రూపాయల విలువైన నిషేధిత డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. వాటిని సీజ్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జ‌రుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement