Friday, December 1, 2023

రేపు హైదరాబాద్ రానున్న చేగువేరా కూతురు మనుమరాలు.. రవీంద్రభారతిలో క్యూబా సంఘీభావ సభ

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : క్యూబా విప్లవయోధుడు చే గువేరా కూతురు డాక్టర్‌ అలైదా గువేరా, మనుమరాలు ప్రొఫెసర్‌ ఎస్తేఫానియా గువేరా ఆదివారం హైదరాబాద్‌ రానున్నారు. తమ పర్యటనలో భాగంగా సాయంత్రం రవీంధ్రభారతిలో జరిగే క్యూబా సంఘీభావ సభలో వారు పాల్గొంటారు. ఈ సందర్భంగా వారికి పౌరసన్మానం కూడా ఉంటుంది. నేషనల్‌ కమిటీఫర్‌ సాలిడారిటీ విత్‌ క్యూబా (ఐప్సో) నిర్వహించనున్నారు.

- Advertisement -
   

సీపీఐ కార్యాలయాన్ని సందర్శించనున్న అలైదా, ఎస్తేఫానియా

మధ్యాహ్నం 12.30 గంటలకు అలైదా, ఎస్తేఫానియా సీపీఐ కార్యాలయం మఖ్దూంభవన్‌ను సందర్శిస్తారు. క్యూబా యోధుడు చే గువేరా అంటే రాజకీయాలకు అతీతంగా అభిమానులు తెలంగాణలో చాలా మంది ఉన్నారు. ఆయన కూతురు, మనుమరాలు రాకను స్వాగతిస్తూ రవీంధ్రభారతి వద్ద ఫ్లెక్సీలు, కటౌట్‌లు పెట్టడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement