Wednesday, March 27, 2024

చారులతగా అనసూయ.. ఫస్ట్ లుక్ రిలీజ్

మైఖేల్ మూవీ నుండి నటి..యాంకర్ అనసూయ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్. హీరో సందీప్‌ కిషన్ లీడ్ రోల్‌లో నటిస్తున్నారు . విజయ్‌ సేతుపతి మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవలే మైఖేల్‌ షూటింగ్ పూర్తయింది. గ్యాంగ్‌ స్టర్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రంజిత్‌ జయకోడి డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రీ వెంక‌టేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, క‌ర‌ణ్ సి ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్లపై పీ రామ్‌మోహ‌న్ రావు, భ‌ర‌త్ చౌద‌రీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మైఖేల్‌ తెలుగు,తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఫిబ్రవరి 3న గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో మైఖేల్‌ ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు మేకర్స్. ఇందులో భాగంగా నేటి నుంచి సినిమాలోని ఒక్కో పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు ఫిలింనగర్‌ సర్కిల్‌ టాక్‌. అనసూయ భరద్వాజ్‌ మైఖేల్‌ చిత్రంలో చారులతగా కనిపించనుంది. నలుపు రంగు చీరలో మ్యాడ్‌ క్వీన్‌గా అగ్రెసివ్‌ లుక్‌లో కనిపిస్తుంది అనసూయ. మైఖేల్‌లో గౌతమ్ వాసుదేవ్‌ మీనన్‌, వరలక్ష్మి శరత్‌ కుమార్‌, వరుణ్‌ సందేశ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్యామ్‌ సీఎస్‌ సంగీతం అందిస్తున్నాడు. మైఖేల్‌లో దివ్యాంక కౌశిక్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement