Saturday, April 20, 2024

ఏప్రిల్‌ 25న చార్‌ధామ్‌ యాత్ర షురూ.. బద్రీనాథ్‌ యాత్ర 27 నుంచి

శీతాకాలం ముగిసిన తర్వాత కేదార్‌నాథ్‌ తెరుచుకునే తేదిని నిర్ణయించారు. ఏప్రిల్‌ 25న భక్తుల కోసం ఆలయ తలుపులు తెరవనున్నట్టు ప్రకటన వెలువడింది. ప్రతి ఏటా మహాశివరాత్రి రోజున కేదార్‌నాథ్‌ ధామ్‌ తలుపులు తెరిచే తేదిని నిర్ణయిస్తారు. ఏప్రిల్‌ 25న ఉదయం 6:30 గంటలకు కేదార్‌నాథ్‌ ద్వారం భక్తుల కోసం తెరవబడుతుంది. శనివారం మహాశివరాత్రి సందర్భంగా ఓంకారేశ్వరాలయంలో ఉదయం 4 గంటల నుంచి మహాభిషేక పూజలు ప్రారంభమయ్యాయి. ఆలయ పూజారులు మతపరమైన ఆచారాల ప్రకారం గర్భగుడిలో అన్ని పూజలు నిర్వహించారు. ఉదయం 8:30 గంటలకు కేదార్‌నాథ్‌ స్వామికి హారతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఉదయం 9 గంటల నుంచి పంచాంగ గణన కోసం ఆలయ కమిటీ ఆచార్యులు పంచకేదార్‌ గద్దిస్థల్‌లో కూర్చున్నారు.

ఉదయం 9:30 గంటలకు పంచాంగ గణన ఆధారంగా కేదార్‌నాథ్‌ పోర్టల్స్‌ తెరవబడే రోజు నిర్ణయించి, ప్రకటించారు. బద్రీనాథ్‌ యాత్ర ఏప్రిల్‌ 27న ప్రారంభం కానున్నది. బద్రీనాథ్‌ ధామ్‌ తలుపులు ఈ సంవత్సరం ఏప్రిల్‌ 27 ఉదయం 7:10 గంటలకు తెరవనున్నారు. బసంత్‌ పంచమి శుభ సందర్భంగా తెహ్రీలోని నరేంద్ర నగర్‌ రాజమహల్‌ వద్ద ధామ్‌ పోర్టల్స్‌ తెరవడానికి తేదిని నిర్ణయిస్తారు. 2002 యాత్రలో 46 లక్షల మంది యాత్రికులు చార్‌ధామ్‌ చేరుకున్నారు. 2022లో కరోనా కాలం తర్వాత రెండేళ్ల అనంతరం ఎలాంటి ఆంక్షలు లేకుండా సాగిన చార్‌ధామ్‌ యాత్ర గత ఏడాది కొత్త రికార్డు సృష్టించింది. తొలిసారిగా 46 మంది లక్షల మంది యాత్రికులు చార్‌ధామ్‌లను సందర్శిచారు. నవంబర్‌ 19న బద్రీనాథ్‌ ధామ్‌ తలుపులు మూసివేయడంలో చార్‌ధామ్‌ యాత్ర ముగిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement