Thursday, March 28, 2024

ఖమ్మం కలెక్టరేట్ వద్ద అలైన్మెంట్ మార్చండి.. ఎంపీ రవిచంద్ర విజ్ఞప్తులపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సానుకూలం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే అలైన్‌మెంట్ మార్పుల అంశాన్ని బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. గురువారం ఆయన పార్లమెంట్ ఆవరణలో కేంద్ర జాతీయ రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిని గడ్కరీని కలిసి పలు జాతీయ రహదారుల సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఖమ్మం మీదుగా వెళ్లే నాగపూర్ – అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే అలైన్‌మెంట్‌ను ఖమ్మం కలెక్టరేట్ వద్ద మార్చాలని కోరారు. ప్రతిపాదిత హైవే మార్గం సమీకృత కలెక్టరేట్ మధ్య నుంచి వెళుతుందని, అది రాకపోకలకు అసౌకర్యంగా ఉండటంతో ఆ మార్గాన్ని మార్చి కలెక్టరేట్ వెనుక నుంచి వెళ్లేలా సవరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదే హైవేపై ఖమ్మం, విజయవాడ మార్గం నుంచి వచ్చే వాహనాలు సూర్యాపేట వద్ద కలిసే మార్గంలో అండర్ పాస్ నిర్మించాలని, జాతీయ రహదారి 65 పై చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేట్ వద్ద కూడా అండర్ పాస్ మంజూరు చేయాలని ఎంపీ రవిచంద్ర కోరారు. ఆయన ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి గడ్కరీ వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సిబ్బందికి సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement