Monday, January 30, 2023

గ్రూప్‌ -1 ప్రిలిమినరీ పరీక్ష తేదీలో మార్పు.. జనవరి 8కి మార్చిన అధికారులు

అమరావతి, ఆంధ్రప్రభ: ఏపీపీఎస్సీ గ్రూప్‌ -1 ప్రిలిమినరీ పరీక్ష తేదీలో మార్పు చోటు-చేసుకుంది. డిసెంబర్‌ 18న జరగాల్సిన ఈ పరీక్షను పాలనా పరమైన కారణాలతో మరో తేదీకి మార్పు చేస్తున్నట్టు- ఏపీపీఎస్సీ ప్రకటించింది. అయితే, ఈ పరీక్ష నిర్వహణకు అధికారులు కొత్త తేదీని నిర్ణయించారు. గ్రూప్‌ -1 ప్రిలిమినరీ పరీక్షను వచ్చే ఏడాది జనవరి 8న నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్‌.అరుణ్‌ కుమార్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇంతకముందు నిర్ణయించిన షెడ్యూల్‌ టైమింగ్స్‌ ప్రకారమే ఈ పరీక్ష నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.

నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్‌ నెలాఖరులో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 92 గ్రూప్‌-1 పోస్టులను భర్తీ చేసేందుకు అక్టోబరు 13 నుంచి నవంబర్‌ 5వరకు ఆ్లనన్లో దరఖాస్తులు స్వీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement