Thursday, April 18, 2024

చంద్ర‌ముఖి2 పూజాకార్య‌క్ర‌మాలు-కీల‌క పాత్ర‌ల్లో రాధికా..వ‌డివేలు

17ఏళ్ల త‌ర్వాత చంద్ర‌ముఖి చిత్రానికి సీక్వెల్ గా చంద్ర‌ముఖి2 తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో న‌టుడు..కొరియోగ్రాఫ‌ర్..ద‌ర్శ‌క‌..నిర్మాత లారెన్స్ న‌టిస్తున్నాడు. చంద్ర‌ముఖి విజ‌యం త‌ర్వాత ర‌జనీతోనే సీక్వెల్‌ను ప‌ట్టాలెక్కించాల‌ని ద‌ర్శ‌కుడు పి.వాసు ఎంతో ప్ర‌య‌త్నించారు. కానీ అది కుద‌ర‌లేదు. ఇన్నేళ్ళ‌కు లారెన్స్‌తో వాసు చంద్ర‌ముఖి-2ను తెర‌కెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్‌ నిర్మిస్తున్నారు. వ‌డివేలు, రాధికా శ‌ర‌త్‌కుమార్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఎమ్‌.ఎమ్ కీర‌వాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి తోట త‌ర‌ణి ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. ఇటీవ‌లే చిత్రం నుండి విడుద‌లైన ప్రీ లుక్స్ సినిమాపై విప‌రీత‌మైన క్యూరియాసిటీని పెంచాయి. రీసెంట్ గా ర‌జ‌నీకాంత్ ని క‌లిసి ఆశీర్వాదం తీసుకున్నాడు లారెన్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement