Thursday, April 25, 2024

ఎన్ 440కే వైరస్ పై విష ప్రచారం

ఏపీలో కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తిలో ఉందని ప్రతిపక్ష టీడీపీ విష ప్రచారం చేస్తోందని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్440కే వైరస్ కేరళలో చాలాకాలం నుంచి ఉందని పరిశోధకులు తేల్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్440 కే వైరస్ లేదని సీసీఎంబీ చెప్పిందని సజ్జల స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు దుష్ప్రచారం వల్లే.. ఒడిశా, ఢిల్లీ ప్రభుత్వాలు ఏపీ ప్రజల రాకపై ఆంక్షలు విధించాయని ఆరోపించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్‌440కే వైరస్‌ లేదని సీసీఎంబీ చెప్పిందని సజ్జల గుర్తుచేశారు.  ఏపీలో ఎన్ 440కె స్ట్రెయిన్ ప్రభావం ఉందని ఎటువంటి ఆధారాలు లేవని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా స్పష్టం చేశారన్నారు. ఫిబ్రవరిలో ల్యాబ్ కల్చర్ చేసినప్పుడు అలా వచ్చింది, దానిని సీరియస్ గా తీసుకోవడానికి వీల్లేదని చెప్పారు. కరోనా వైరస్ కు సంబంధించి ఏమాత్రం అవగాహన లేకుండా, రాజకీయ అంశంకాని సైన్స్ పరమైన అంశాలను కూడా విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఎన్440కే వైరస్ అంత ప్రమాదకరమైంది కాదని పరిశోధనల్లో తేలిందని చెప్పారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ విపత్కరణ పరిస్థితుల్లో విపక్షాలు బురద రాజకీయాలు మాని ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా బాధితులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటికే అన్ని ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యలు అందిస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు.

మరోవైపు, కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతుందన్నారు. టీకా తయారీతో పాటు పంపిణీ వ్యవహారాలు కేంద్రం పరిధిలో ఉన్నాయన్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సీరం కంపెనీ యాజమాన్యంకు ఏప్రిల్ 24న రాష్ట్ర ప్రభుత్వ తరఫున ప్రిన్సిపల్ సెక్రటరీ 4.08 కోట్లు వ్యాక్సిన్ లు కావాలని లేఖ రాశారన్నారు. అలాగే, భారత్ బయోటెక్ యాజమాన్యానికి కూడా ఏప్రిల్ 24వ తేదీన 4 కోట్లు వ్యాక్సిన్ లు కావాలని లేఖ రాస్తే.. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మాత్రమే వ్యాక్సిన్లు సరఫరా చేస్తామని స్పష్టంగా ఆయా యాజమాన్యాలు తిరుగు లేఖలు రాశాయన్నారు.  కేంద్రం అనుమతి లేకుండా వ్యాక్సిన్లు ఇచ్చే పరిస్థితి లేదని సజ్జల గుర్తు చేశారు.

ఇదీ చదవండి: ఎన్440కే వైరస్: చంద్రబాబుపై కర్నూలులో కేసు నమోదు

Advertisement

తాజా వార్తలు

Advertisement