Wednesday, March 29, 2023

మాచర్ల విధ్వంసానికి చంద్రబాబే కారకుడు.. అంబటి

పల్నాడు జిల్లా మాచర్లలో నిన్న జరిగిన విధ్వంసానికి చంద్రబాబే కారకుడని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆయన మాట్లాడుతూ… బ్రహ్మారెడ్డి గొడవలు సృష్టించడమే పనిగా పెట్టుకున్నారని, వైఎస్ఆర్సిపి కార్యకర్తలని దారుణంగా కొట్టారని.. అయినా వైఎస్ఆర్సిపి ప్రశాంత వాతావరణ కోరుకుంటున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి కాలి గోటిని కూడా పీకలేరన్నారు. ఫ్యాక్షన్ నేర చరిత్ర ఉన్న బ్రహ్మ రెడ్డిని మాచర్ల టిడిపి ఇన్చార్జిగా నియమించడం ద్వారా చంద్రబాబు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. దాడులు చేయాలని చంద్రబాబు బహిరంగ సభలలోనే రెచ్చగొట్టి మాట్లాడిన సంగతి గుర్తు చేశారు. ప్లాన్ ప్రకారమే మాచర్లలో టిడిపి నేతలు దాడులు చేశారని మంత్రి అంబటి ఆరోపించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement