సీనియర్ నటుడు చలపతి రావు మృతిపట్ల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. ఆయన మృతి బాధాకరమని అన్నారు. ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన ముద్ర వేశారని చెప్పారు. నిర్మాతగా మంచి చిత్రాలు నిర్మించారని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని వెల్లడించారు. చలపతిరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
- Advertisement -