విలక్షణమైన నటుడు, తనదైన శైలితో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న చలపతి రావు అకాల మరణ వార్త నన్ను కలచివేసిందని చిరంజీవి ట్వీట్ చేశారు. ఎన్నో చిత్రాల్లో ఆయనతో నేను కలిసి నటించడం జరిగిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, రవి బాబుకి, ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వేసే వేషాలు, ఆయన వేసే జోకులకు.. వ్యక్తిగత విషయాలకు సంబంధం ఉండేది కాదు. టీ కాఫీలు కూడా తాగేవారు కాదు.. చాలా ఆరోగ్యంగా ఉంటారు.. కానీ ఇలా ఆయన అకాల మరణం కలిచివేసింది అని అన్నారు చిరంజీవి.
చలపతిరావు మరణం బాధాకరం : చిరంజీవి

Advertisement
తాజా వార్తలు
Advertisement