Friday, November 15, 2024

ఏపీ శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ గా మోషేన్ రాజు..

వైఎస్ ఆర్ ఫ్యామిలీ ఎంతోమంది సామాన్యుల‌ను ఉన్న‌త‌స్థాయికి తీసుకువ‌చ్చింద‌ని మోషేన్ రాజు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సీఎం జగన్‌ సముచిత స్థానం కల్పిస్తున్నారని మోషేన్‌రాజు అన్నారు. దళితుడిని ఉన్నతస్థాయిలో కూర్చొబెట్టిన ఘనత సీఎం జగన్‌దని ఆయన పేర్కొన్నారు. ఈ స్థాయికి వస్తానని అనుకోలేదు. ఎప్పుడూ వైఎస్సార్‌ కుటుంబంతో ఉండేందుకు ఇష్టపడతానన్నారు. రాజకీయాలకు కులం, డబ్బు అవసరం లేదు. ప్రజల విశ్వాసం ఉంటే చాలని నమ్మిన నాయకుడు జగన్ అని మోషేన్‌ రాజు అన్నారు. ఏపీ శాసనమండలి ఛైర్మన్‌గా కొయ్యే మోషేన్‌రాజు బాధ్యతలు స్వీకరించారు. మోషేన్‌రాజును చైర్‌వద్దకు తీసుకొచ్చిన సీఎం జగన్‌.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మోషేన్‌రాజు నిబద్ధత గల రాజకీయ నాయకుడు అని చెప్పారు. ఈ సందర్భంగా మోషేన్‌రాజుకు మంత్రులు, ఎమ్మెల్సీలు అభినందనలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement