Friday, March 29, 2024

టీటీడి హిందూ ధర్మ సలహాదారుగా చాగంటి నియామ‌కం

తిరుపతి (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి): తిరుమల తిరుపతి దేవస్థానముల (టీటీడీ) ధర్మ ప్రచార కార్యక్రమాల సలహాదారుగా ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు నియమితులు కానున్నారు. తిరుపతిలోని పద్మావతి అతిధిగృహంలో శుక్రవారం సాయంత్రం చైర్మన్ వై వీ సుబ్బారెడ్డి, ఈ ఓ ధర్మారెడ్డి నేతృత్వంలో జరిగిన టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సమీక్ష సమావేశంలో ఈ మేర‌కు తీర్మానించారు.

ఇవి కాక హిందూ ధర్మ ప్రచారం కార్యక్రమాలను గ్రామీణ స్థాయిలో నిర్వహిండానికి ప్రణాళికలు రూపొందించాలని కూడా సమావేశం తీర్మానించింది. ఈ సమావేశం లో పాలకవర్గ సభ్యులు విశ్వనాథ్, మల్లీశ్వరి, రాములు, జె ఈ ఓ సదా భార్గవి, ఎస్విబీసి చైర్మన్ డాక్టర్ సాయికృష్ణ యాచేంద్ర, సీఈ ఒ షణ్ముఖ్ కుమార్, టీ టీ డి కి చెందిన వివిధ ప్రాజెక్ట్‌ల ప్రత్యేక అధికారి విజయ లక్ష్మి, ఇతర సభ్యులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement